లూసిఫ‌ర్‌కి సీక్వెల్‌ని ప్ర‌క‌టించిన మోహ‌న్‌లాల్‌

Sequel to Mohanlal's Lucifer announced
Wednesday, June 19, 2019 (All day)

మోహ‌న్‌లాల్ ఇటీవ‌ల న‌టించిన "లూసిఫ‌ర్" సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మ‌ల‌యాళంలో రూపొందిన ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ని తెలుగులోనూ అదే పేరుతో డ‌బ్ చేశారు. ఇక్క‌డ కూడా సూప‌ర్‌గానే ఆడింది. ఈ స‌క్సెస్‌ని చూసి ఇపుడు దీనికి సీక్వెల్‌ని ప్ర‌క‌టించాడు ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్.

హీరోగా ఎన్నో హిట్స్ ఇచ్చిన పృథ్వీరాజ్‌... మొద‌టిసారిగా డైర‌క్ట‌ర్‌గా మారి మోహ‌న్‌లాల్ క‌థానాయ‌కుడిగా లూసిఫ‌ర్ తీశాడు. "ఎల్‌2" లేదా "ఎముపురాన్" అనే పేరుతో పిలుస్తున్న ఈ సీక్వెల్ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. లూసిఫ‌ర్ ...డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లోనూ సంచ‌ల‌నం సృష్టించింది. పృథ్వీరాజ్‌కి మాస్ ప‌ల్స్ తెలిసిన మేక‌ర్‌గా పేరు వ‌చ్చింది. మోహ‌న్‌లాల్ అభిమాని అయిన పృథ్వీరాజ్‌...ఈ సినిమాని అద్భుత‌మైన క‌మర్షియ‌ల్ సినిమాగా మ‌లిచాడు. తాను స్వ‌యంగా హీరో అయిన‌ప్ప‌టికీ పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని త‌న అభిమాన హీరోతోనే తీశాడు.

లూసిఫ‌ర్ 2 మ‌రింత గ్రాండ్‌గా, రిచ్‌గా తీస్తాడ‌ట‌.