నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన "ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమాకి రిలీజ్ ముందు యమా క్రేజ్ వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ కావడం, శాతకర్ణి తర్వాత బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ అవడం వంటి కారణాలతో పాటు సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుంది కాబట్టి బయ్యర్లు ఎగబడి కొన్నారు. బాలయ్య కెరియర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకొంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాని థియేట్రికల్ బిజినెస్ 71 కోట్ల రూపాయలకి (ప్రపంచవ్యాప్తంగా) చేశారట. డిజిటల్, శాటిలైట్ ఇతరత్ర ఆదాయం వేరు. 71 కోట్ల రూపాయలకి అమ్మితే.. థియేటర్ల ద్వారా వచ్చిన కలెక్షన్ కేవలం 21 కోట్ల రూపాయలే.