తేలిన నష్టం 50 కోట్లంట!
నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన "ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమాకి రిలీజ్ ముందు యమా క్రేజ్ వచ్చింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ కావడం, శాతకర్ణి తర్వాత బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ అవడం వంటి కారణాలతో పాటు సంక్రాంతి సీజన్‌లో విడుదల కానుంది కాబట్టి బయ్యర్లు ఎగబడి కొన్నారు. బాలయ్య కెరియర్‌లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరుపుకొంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాని థియేట్రికల్ బిజినెస్ 71 కోట్ల రూపాయలకి (ప్రపంచవ్యాప్తంగా) చేశారట. డిజిటల్, శాటిలైట్ ఇతరత్ర ఆదాయం వేరు. 71 కోట్ల రూపాయలకి అమ్మితే.. థియేటర్ల ద్వారా వచ్చిన కలెక్షన్ కేవలం 21 కోట్ల రూపాయలే. అంటే 50 కోట్లు హాంఫట్.
ఈ సినిమా రన్ మొత్తం పూర్తయింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మినహా...మిగతా అన్ని చోట్ల థియేటర్ల నుంచి సినిమాని తీసేశారు. ఇక వచ్చే రెవిన్యూ ఏమీ లేదు.
ఈ 50 కోట్లు ఎవరు నష్టపోయినట్లు? ఒక్కో ప్రాంతానికి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకే నష్టం. దీన్ని రెండో పార్ట్‌లో భర్తీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే... 50 కోట్లు, ఆపైన నష్టపోయిన తెలుగు సినిమాల్లో ఇది మూడోది.
మహేష్‌బాబు నటించిన "స్పైడర్", పవర్‌స్టార్ నటించిన "అజ్ఞాతవాసి" ఇదే కోవలోకి చెందినవట.
- Log in to post comments