తెలుగునాట చాలా కాలంగా ఒక రూమర్ ఉంది. ఒక రియల్ ఎస్టేట్ గొడవలో ఫ్యాక్షన్ లీడర్ పరిటాల రవి అనుచరులను పవర్‌స్టార్ తిట్టాడనీ తెలిసి పరిటాల పవన్‌కల్యాణ్‌కి గుండు కొట్టించాడట. ఈ ప్రచారం జనంలో ఉంది. చాలా మంది ఇది నిజమే అని నమ్మారు. ఎందుకంటే అప్పట్లో పరిటాల రవి అంత పవర్ఫుల్ ఫ్యాక్షన్ నాయకుడు. ఆ టైమ్‌లో పవన్‌కల్యాణ్ గుండుతో ఉన్న ఫోటోలు కూడా పత్రికల్లో దర్శనం ఇచ్చాయి. సితార పత్రిక ఏకంగా కవర్ పేజీ వేసింది.