కులం పరువు, కుటుంబం పరువు అంటూ మిర్యాలగూడకి చెందిన మారుతిరావు తన సొంత కూతురి భర్తని చంపించిన ఘటన అందర్నీ కలిచివేసింది. కులపిచ్చి మనుషుల మనసుల్లో విషంగా ఎలా ఎక్కిందో నిరూపించిన అమానుష ఘటన..ప్రణయ్ హత్య. మిర్యాలగూడకి చెందిన ప్రణయ్.. అమృత అనే అగ్రవర్ణాలకి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమృత తన తల్లితండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పారిపోయి ప్రణయ్‌ని పెళ్లాడింది. దళితుడైన ప్రణయ్..తన కూతురు పెళ్లాడాడు అనే కక్షతో అతన్ని చంపించాడు మారుతీరావు.