ఐటీ రైడ్స్ ను మరో కోణంలో చూడడం అనేది ఈ దేశంలో చాన్నాళ్ల కిందటే మొదలైంది. నిజంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అనుమానం వచ్చి, ముందే కోవర్ట్ ఆపరేషన్ చేసి, ఆ తర్వాత మూకుమ్మడిగా నివాసాలు-ఆఫీసులపై దాడులు చేయడం అనేది ఇప్పుడు దాదాపు లేదనే చెప్పాలి. ఐటీ దాడులనేది ఇప్పుడు రాజకీయమైపోయింది. కక్షపూరితంగా ఒకరిపై ఒకరు దాడులు చేయించుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి రష్మిక ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరమైన అంశంగా మారింది.