మగధీర సినిమాను హిందీలో రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. హృతిక్ రోషన్ నుంచి షాహిద్ కపూర్ వరకు చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. సంజయ్ లీలా భన్సాలీ నుంచి సంతోష్ శివన్ వరకు చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు “హిందీ మగధీర” తెరపైకి రాలేదు. అయితే ఇకపై దాన్ని హిందీలో తీయాల్సిన అవసరం లేదు. మగధీరకు హైటెక్ వెర్షన్ లాంటి సినిమా ఒకటి బాలీవుడ్ లో రెడీ అయిపోయింది. అదే రాబ్తా మూవీ.