సైరా సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా సాగుతోంది. ఇటీవలే తమిళ నటుడు విజయ్ సేతుపతి తన పోర్సన్‌ని కొంత ఫినిష్ చేశాడు హైదరాబాద్‌లో. విజయ్ సేతుపతి ఈ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపిస్తాడు.
తమిళనాట వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, స్టార్ స్టేటస్‌ని పొందిన విజయ్ సేతుపతి...సైరాలో ద్రవిడ కింగ్‌గా కనిపించనున్నాడట. తెలుగు భాష మాట్లాడే ద్రవిడ రాజు పాత్ర అది. సొంతంగా తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడట. తెలుగు భాష రాదు కానీ ఇపుడు నేర్చుకుంటున్నట్లు చెప్పాడు.