ద్ర‌విడ రాజు పాత్ర‌లో విజ‌య్‌

Vijay Sethupathi as Dravida King in Sye Raa
Monday, July 30, 2018 - 14:00

సైరా సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జోరుగా సాగుతోంది. ఇటీవ‌లే త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి త‌న పోర్స‌న్‌ని కొంత ఫినిష్ చేశాడు హైద‌రాబాద్‌లో. విజ‌య్ సేతుప‌తి ఈ సినిమాలో గెస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తాడు.

త‌మిళ‌నాట వైవిధ్య‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని, స్టార్ స్టేట‌స్‌ని పొందిన విజ‌య్ సేతుప‌తి...సైరాలో ద్రవిడ కింగ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. తెలుగు భాష మాట్లాడే ద్రవిడ రాజు పాత్ర అది. సొంతంగా త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాడ‌ట‌. తెలుగు భాష రాదు కానీ ఇపుడు నేర్చుకుంటున్న‌ట్లు చెప్పాడు.

ఈ సినిమా త‌ను ఒప్పుకోవ‌డానికి మెయిన్ రీజ‌న్ చిరంజీవి సార్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌డ‌మే అని చెపుతున్నాడు. చిన్న‌ప్ప‌ట్నుంచి మెగాస్టార్ సినిమాలంటే ఎక్కువ ఇష్టంగా చూసేవాడ‌ట‌. అందుకే చిరుతో ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించే చాన్స్ రావ‌డంతో ఒప్పుకున్నా అని అంటున్నాడు.