నాగ చైతన్యతో పోటీ కాదు, నాగ చైతన్యతో కలిసి వస్తున్నా అని అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి చెపుతోంది సమంత. చైతన్య నటించిన "శైలజారెడ్డి అల్లుడు", సమంత తొలిసారిగా యాక్ట్ చేసిన థ్రిల్లర్ "యూటర్న్" ఒకే రోజు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 13న ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఒకరోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భార్యభర్తలిద్దరూ పోటీపడుతున్నారని అందరూ కామెంట్ చేస్తున్నారు. దాంతో చైతన్య వెర్సెస్ సమంత కాదు సమంత విత్ చైతన్య అని అనండి అని చెపుతోంది.
వినడానికి ఇది బాగానే ఉంది. మరి ఇద్దరూ తమ సినిమాలని కలిసి ప్రమోట్ చేస్తారా?
"రంగస్థలం" సినిమాలో పల్లెటూరి యువతిగా మెప్పించింది. "మహానటి"లో జర్నలిస్ట్‌గా అదరగొట్టింది. ఇక ఇపుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది సమంత. "యూటర్న్" సినిమాలో ఆమె హీరోయిన్.