స‌మంత పెట్టుబ‌డి లేదంట‌!

Samantha's investment in UTurn is zero
Friday, August 17, 2018 - 20:00

"రంగ‌స్థ‌లం" సినిమాలో ప‌ల్లెటూరి యువ‌తిగా మెప్పించింది. "మ‌హాన‌టి"లో జ‌ర్న‌లిస్ట్‌గా అద‌ర‌గొట్టింది. ఇక ఇపుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది స‌మంత‌. "యూట‌ర్న్" సినిమాలో ఆమె హీరోయిన్‌.

ఈ మూవీ ట్ర‌యిల‌ర్ వ‌చ్చింది. ట్ర‌యిల‌ర్‌ని బ‌ట్టి చూస్తే ఇదొక వైవిధ్య‌మైన థ్రిల్ల‌ర్‌లా క‌నిపిస్తోంది. ఇందులో ఆమె స‌ర‌స‌న స్టార్ హీరో లేరు. రొమాంటిక్ సాంగ్స్ ఉండ‌వు, ఆఫ్‌బీట్ థ్రిల్ల‌ర్‌. వెరైటీ కోస‌మే ఆమె ఈ మూవీ చేసింద‌ట‌. అనుష్క‌, న‌య‌న‌తార ఇలాంటి చిత్రాలు భారీ విజ‌యాలు అందుకున్నారు. ధీరోయిన్లుగా పేరు తెచ్చుకున్నారు. అదే పంథాలో తాను కూడా నేమ్ తెచ్చుకోవాల‌నేది ఆమె ఆరాటం. అందుకే ఈ ప్ర‌య‌త్నం. మ‌రి ఆమె ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందా?

సెప్టెంబ‌ర్ 12న విడుద‌ల కానున్న యూట‌ర్న్ క‌న్న‌డ సినిమాకి రీమేక్‌. క‌న్న‌డంలో తీసిన ద‌ర్శ‌కుడే తెలుగులోనూ తీశాడు. స‌మంత ఇందులో పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది కానీ అలాంటిదేమీ లేద‌ట‌. ఒక రాజ‌కీయ‌నాయ‌కుడి కుమారుడి డ‌బ్బులు ఇందులో ఉన్న‌ట్లు టాక్‌.