మహేష్‌బాబు సరసన "మహర్షి" సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది పూజా హెగ్డే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణలో పాల్గొనాలి పూజా. అంటే ఏప్రిల్ నుంచి ఆమె డేట్స్ ఇక ఫ్రీ. ఈ సినిమా కాకుండా తెలుగులో ఆమె నటిస్తున్న మరో బడా మూవీ.. ప్రభాస్ హీరోగా జిల్ రాధాకృష్ణ తీస్తున్న లవ్‌స్టోరీ. మహేష్‌బాబు సినిమా పూర్తి కావడంతో ఏప్రిల్ నుంచి అల్లు అర్జున్ సినిమాకి డేట్స్ ఇచ్చింది ఈ అందాల భామ.
ఏప్రిల్ 8..అల్లు అర్జున్ పుట్టిన రోజు. కొన్నేళ్లుగా తన ప్రతి పుట్టిన రోజుకి లేదా బర్త్‌డేకి ఒక వారం ముందో, వెనుకో తన సినిమాని విడుదల చేస్తూ వస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే వచ్చాయి రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు చిత్రాలు. నా పేరు సూర్య సినిమాని కూడా ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలని ప్రయత్నించినా.. భరత్ అనే నేను సినిమా కారణంగా మే మొదటి వారానికి షిప్ట్ చేశాడు. ఐతే నా పేరు సూర్య సినిమా ఫ్లాప్ కావడంతో మరో సినిమాని ప్రారంభించేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు. చివరికి త్రివిక్రమ్ డైరక్షన్‌లో సినిమా ఓకే చేశాడు.
అల్లు అర్జున్ కూతురు అర్హకు జస్ట్ రెండేళ్లు మాత్రమే. ఆ వయసుకే ఆ పాప పెళ్లి చేసుకోనంటోంది. అయితే ఇదంతా సరదాగానే. నేను చూసిన అబ్బాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలంటాడు బన్నీ. నేను చేసుకోను అంటూ ముద్దుగా సమాధానం ఇస్తుంది అర్హ. ఆ రిప్లయ్ కు దొంగ ఫెలో అంటూ బన్నీ పొంగిపోతుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.