మహేష్‌బాబు నటిస్తున్న "మహర్షి" సినిమా షూటింగ్ తుది దశకి చేరుకొంది. ఈ సినిమాకి సంబంధించిన చిన్న ఎపిసోడ్‌ని ఇటీవల చెన్నై, మహాబలిపురంలలో చిత్రీకరించారు. చెన్నై షూటింగ్ పూర్తి అయిందని మహేష్‌బాబు భార్య నమత్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్‌బాబు కూతురు, కొడుకు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు.. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేశారు.