ఏరుసెనగా కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెలాగ ఎంత సక్కాగున్నావే లచ్చిమి ఎంత సక్కాగున్నావే
సింతాసెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమామలాగ ఎంత సక్కాగున్నావే లచ్చిమి ఎంత సక్కాగున్నావే
మల్లెపూల మధ్య ముద్దబంతిలాగ ఎంత సక్కాగున్నావే! ముత్తయిదువ మెల్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కాగున్నావే! సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కాగున్నావే!
//ఏరుసెనగా కోసం మట్టిని తవ్వితే..//