నే(మే)టి పాట - ఎంత స‌క్కాగున్నావే

Yentha Sakkagunnaave - Lyrics - Rangasthalam
Tuesday, February 13, 2018 - 18:30

ఏరుసెన‌గా కోసం మ‌ట్టిని త‌వ్వితే
ఏకంగా త‌గిలిన లంకెబిందెలాగ‌
ఎంత స‌క్కాగున్నావే
ల‌చ్చిమి ఎంత సక్కాగున్నావే

సింతాసెట్టు ఎక్కి
సిగురు కొయ్య‌బోతే
సేతికి అందిన సంద‌మామ‌లాగ‌
ఎంత స‌క్కాగున్నావే
ల‌చ్చిమి ఎంత సక్కాగున్నావే

మ‌ల్లెపూల మ‌ధ్య ముద్ద‌బంతిలాగ‌
ఎంత సక్కాగున్నావే!
ముత్త‌యిదువ మెల్లో ప‌సుపు కొమ్ములాగ‌
ఎంత సక్కాగున్నావే!
సుక్క‌ల సీర క‌ట్టుకున్న ఎన్నెల‌లాగ‌
ఎంత సక్కాగున్నావే!

//ఏరుసెన‌గా కోసం మ‌ట్టిని త‌వ్వితే..//

చ‌ర‌ణం:
గాలి ప‌ల్ల‌కీలో ఎంకిపాట‌ల్లాగ‌
ఎంకి పాట‌ల్లోన తెలుగు మాట‌ల్లాగ‌
ఎంత స‌క్కాగున్నావే
ల‌చ్చిమి ఎంత సక్కాగున్నావే

క‌డ‌వ నువ్వు న‌డుమున బెట్టి
క‌ట్ట మీద న‌డిసొత్తా ఉంటే
సంద్రం నీ సంకెక్కిన‌ట్టు
ఎంత స‌క్కాగున్నావే
ల‌చ్చిమి ఎంత సక్కాగున్నావే

క‌ట్టెల మోపు త‌లకెత్తుకొని
అడుగులోన అడుగెత్తావుంటే
అడివి నీకు గొడుగెత్తిన‌ట్టు
ఎంత స‌క్కాగున్నావే
ల‌చ్చిమి ఎంత సక్కాగున్నావే

బుర‌ద‌సేల్లో
వ‌రి నాటు వేత్తా వుంటే ఎంత స‌క్కాగున్నావే

భూమి బొమ్మ‌కు
నువ్వు ప్రాణం పోస్తున్న‌ట్లు ఎంత స‌క్కాగున్నావే

//ఏరుసెన‌గా కోసం మ‌ట్టిని త‌వ్వితే..//

|

Error

The website encountered an unexpected error. Please try again later.