మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం..మహర్షి. మహేష్‌బాబుకిది ప్రిస్టిజియేస్ మూవీ. 25వ సినిమాకి రిలీజ్ డేట్‌ని పక్కాగా ఫిక్స్ చేశాడు నిర్మాత దిల్‌రాజు. ఏప్రిల్ 25నే విడుదల అవుతుందని మరోసారి ప్రకటించాడు. ఇదే ఫైనల్ డేట్ అని చెప్పాడు.
మొదట మహర్షికి ఏప్రిల్ 5 అని డేట్ ఫిక్స్ చేశారు. ఐతే షూటింగ్‌లో జాప్యం జరిగింది. దాంతో తేదీ మారింది. మార్చి కల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం. అని దిల్ రాజు వివరించారు.
ఏంటి హెడ్‌లైన్‌ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏమి లేదండి. నమ్రత అలా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేశారు. తన భర్త ఇంటికి వచ్చాడని...హి ఈజ్ బ్యాక్...హోమ్ అని ఆనందంగా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంట? వెల్... మహేష్‌బాబు పొల్లాచ్చి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారన్నమాట.
ఒకప్పుడు మహేష్ నుంచి ఓ ట్వీట్ వచ్చిందంటే అది చాలా పెద్ద విషయం. అభిమానులు పండగ చేసుకునేవాళ్లు. మహేష్ ట్వీట్ పై పుంఖానుపుంఖాలుగా వార్తలు కూడా వండివార్చేవారు. కేవలం తన సినిమాలకు సంబంధించి లేదా కుటుంబ సభ్యుల ప్రమోషన్ కోసం మాత్రమే ట్విట్టర్ వాడేవాడు మహేష్. కానీ ఇప్పుడీ హీరోలో మార్పు వచ్చింది. తాజా ట్వీట్లే దీనికి ఉదాహరణ.
సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ చూసేశాడు మహేష్. వాటిపై ట్వీట్స్ కూడా పెడుతున్నాడు. గడిచిన 3 రోజులలో మహేష్ నుంచి వరుసగా ట్వీట్స్ వచ్చాయి. లెక్కలేనన్ని పొగడ్తలు కురిపించాడు.