మహేష్‌బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆయన నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం అనేకసార్లు వాయిదాపడింది. ఫైనల్‌గా ఆదివారం లాంఛనంగా లాంచ్ అయింది. మహేష్‌బాబు తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ గచ్చిబౌలిలోని ఎ.ఎం.బి సినిమాస్ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు.
మహేష్‌బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభం మరోసారి వాయిదా పడింది. ఈ మల్టీప్లెక్స్‌ని అమీర్‌ఖాన్ నటించిన "థగ్స్ ఆఫ్ హిందూస్తాన్"తోనే ప్రారంభించాలనుకున్నారు కానీ అప్పటికీ థియేటర్ పూర్తిగా రెడీ కాలేదని వాయిదా వేశారు. రీసెంట్‌గా రజనీకాంత్ "టూ పాయింట్ ఓ"తో మొదలుపెట్టాలని హంగామా చేశారు. కానీ ఇపుడు అదే సమస్య వచ్చిందట.
"మహర్షి" సెట్స్ లో ఎవరు కనిపిస్తారు..? కామన్ గా మహేష్ ఉంటాడు. మహేష్ పక్కన వంశీ పైడిపల్లి ఉంటాడు. లేదంటే హీరోయిన్ పూజాహెగ్డే, మరో కీలక నటుడు అల్లరి నరేష్.. ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. అదే మహర్షి సెట్స్ లో మహేష్ తో పాటు ఓ తమిళ హీరో కనిపిస్తే..? అలాంటి సన్నివేశమే కనిపించింది సోమవారం నాడు.
హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతంగా పేరొందిన గచ్చిబౌలిలో మహేష్‌బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభానికి రెడీ అయింది. నిజానికి ఈ మల్టీప్లెక్స్‌ని అమీర్‌ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంతోనే ప్రారంభించాలనుకున్నాడు. అమీర్‌ఖాన్‌ని ఇన్వైట్ చేశారు. కానీ అమీర్‌ఖాన్ రాలేనని చెప్పడంతో క్యాన్సిల్ అయింది. ఇక ఇపుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ చిత్రం 2.0తో ప్రారంభిస్తాడట. రజనీకాంత్‌ని ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.