దర్శకుడు అనిల్ రావిపూడి తొలి సినిమా..పటాస్. ఆ సినిమాలో నటించిన శ్రుతి సోధికి తన రెండో సినిమా సుప్రీం సినిమాలో సాంగ్ చేయించాడు. సుప్రీం సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాశిఖన్నాతో తన మూడో మూవీ రాజా ది గ్రేట్‌లో స్పెషల్ సాంగ్‌లో చూపించాడు.
ఒకప్పటితో పోల్చితే ఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొఫెషనిలిజం వచ్చింది. రిలీజ్ డేట్స్‌ని చాలా ముందుగానే ఫిక్స్ చేసి..దానికి కట్టుబడి ఉంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో మాత్రం మార్పు ఉండడం లేదు. ఐతే వంశీ పైడిపల్లి వంటి కొందరు దర్శకులు మాత్రం ఇప్పటికీ చెప్పిన డేట్‌కి సినిమాని పూర్తి చేయలేకపోతున్నారు. ట్రేడ్ వర్గాలు వంశీ పైడిపల్లి, సుకుమార్ వంటి కొందరు దర్శకులకి చెక్కుడు డైరక్టర్స్ అని నామకరణం చేసింది. ఏ సినిమాని చెప్పిన డేట్‌కి పూర్తి చేయరు. అనేక సార్లు వాయిదాలు కోరుతారు.