'మహర్షి'లో త‌మిళ హీరో

Simbu meets Mahesh Babu on the sets of Maharshi
Monday, November 26, 2018 - 22:15

"మహర్షి" సెట్స్ లో ఎవరు కనిపిస్తారు..? కామన్ గా మహేష్ ఉంటాడు. మహేష్ పక్కన వంశీ పైడిపల్లి ఉంటాడు. లేదంటే హీరోయిన్ పూజాహెగ్డే, మరో కీలక నటుడు అల్లరి నరేష్.. ఎవరైనా ఇలానే ఆలోచిస్తారు. అదే మహర్షి సెట్స్ లో మహేష్ తో పాటు ఓ తమిళ హీరో కనిపిస్తే..? అలాంటి సన్నివేశమే కనిపించింది సోమ‌వారం నాడు.

మహర్షి సెట్స్ లో సడెన్ గా ప్రత్యక్షమయ్యాడు కోలీవుడ్ హీరో శింబు. మహేష్, శింబును సాదరంగా ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. మహేష్ నటించిన అన్ని సినిమాలు చూశానన్నాడు శింబు. దానికి మహేష్ థ్యాంక్స్ చెప్పాడు. తమిళ సినిమాలతో పాటు రీసెంట్ గా శింబు నటించిన నవాబ్ సినిమా గురించి మహేష్ మాట్లాడాడు. శింబు పెర్ఫార్మెన్స్ ను మెచ్చుకున్నాడు. 

అంతా బాగానే ఉంది కానీ మహర్షి సెట్స్ లో శింబు ఎందుకనేగా మీ అనుమానం. ఇందులో పెద్దగా సందేహించాల్సిందేం లేదు. రామోజీ ఫిలింసిటీలో వేసిన విలేజ్ సెట్ లో మహర్షి షూటింగ్ జరుగుతోంది. ఆ పక్కనే శింబు కూడా తన కొత్త సినిమా "వంత రాజవంతాన్ వరువేన్ష (అత్తారింటికి దారేది త‌మిళ రీమేక్‌) షూటింగ్ కూడా జరుగుతోంది. పక్కనే మహేష్ ఉన్నాడని తెలుసుకున్న శింబు, తన షూటింగ్ గ్యాప్ లో స్వయంగా వెళ్లి మహేష్ ను కలిశాడు.