మహేష్‌బాబు మల్టీప్లెక్స్ అదుర్స్

హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతంగా పేరొందిన గచ్చిబౌలిలో మహేష్‌బాబు నిర్మించిన మల్టీప్లెక్స్ ప్రారంభానికి రెడీ అయింది. నిజానికి ఈ మల్టీప్లెక్స్‌ని అమీర్‌ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంతోనే ప్రారంభించాలనుకున్నాడు. అమీర్‌ఖాన్‌ని ఇన్వైట్ చేశారు. కానీ అమీర్‌ఖాన్ రాలేనని చెప్పడంతో క్యాన్సిల్ అయింది. ఇక ఇపుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ చిత్రం 2.0తో ప్రారంభిస్తాడట. రజనీకాంత్‌ని ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఏఎంబీ బ్రాండ్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు మహేష్‌బాబు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహేష్‌బాబు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. హైదరాబాద్‌లో సక్సెస్ అయ్యాక ఏపీ, తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ మల్టీప్లెక్స్‌లు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం ఉన్న వాటితో పోల్చితే ఈ మల్టీప్లెక్స్ లగ్జరీగా ఉంటుంది. సీటింగ్ కూడా అదుర్స్ అని చెప్పొచ్చు.
ఏడు స్ర్కీన్లు, 1600 సీట్లు ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకత. లగ్జరీ క్లాస్ కూడా ఉంటుంది. ప్రీమియం లుక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Log in to post comments