న్యూ ఇయర్ జోష్ నుంచి మహేష్ బాబు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ హీరో కుటుంబంతో పాటు ఒమన్ లో విహరిస్తున్నాడు. ఒమన్ లో మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని నమ్రత ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది.
తాజాగా మహేష్, తన కుమారుడు గౌతమ్ తో కలిసి పారా గ్లైడింగ్ చేశాడు. ప్రస్తుతం ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుల్ ఎంజాయ్ మెంట్ మూడ్ లో మహేష్ ఉన్న ఫొటోలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
మహేష్ జోష్ చూస్తుంటే.. స్పైడర్ ఫ్లాప్ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్టు కనిపిస్తోంది.
నాని సక్సెస్ గ్రాఫ్ ఇపుడు మామూలుగా లేదు. సౌత్ ఇండియాలో నాని రేంజ్‌లో వరుస హిట్స్ ఇస్తున్న హీరో మరొకరు లేరు. టాక్‌తో సంబంధం లేదు, రేటింగ్‌లతో ముడిపెట్టేది లేదు. నానికి మేం మినిమం హిట్ ఇస్తామని తెలుగు ప్రేక్షకులు తీర్మానించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఊపులోనే నాని మరో సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.
డీజేలో చూపించిన అందాలు పూజా హెగ్డేకు టాలీవుడ్ లో కొత్త ఇమేజ్ తీసుకొచ్చాయి. ఎందుకంటే అంతకుముందు ఆమె తెలుగులో ఆమె గ్లామర్ షో చేయలేదు. డీజేకి ముందు రెండు సినిమాల్లో నటించింది. ఎట్టకేలకు డీజేతో ఆ అవకాశం రావడంతో దాన్ని ఫుల్లుగా వాడేసుకుంది పూజా. పనిలోపనిగా బికినీ కూడా వేసింది. ఈ గ్లామర్ షో ఆమెకు ఇపుడు క్రేజీ ఆఫర్లు తెచ్చిపెట్టింది.