ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మహేష్

న్యూ ఇయర్ జోష్ నుంచి మహేష్ బాబు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ హీరో కుటుంబంతో పాటు ఒమన్ లో విహరిస్తున్నాడు. ఒమన్ లో మహేష్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోల్ని నమ్రత ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది.
తాజాగా మహేష్, తన కుమారుడు గౌతమ్ తో కలిసి పారా గ్లైడింగ్ చేశాడు. ప్రస్తుతం ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫుల్ ఎంజాయ్ మెంట్ మూడ్ లో మహేష్ ఉన్న ఫొటోలు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
మహేష్ జోష్ చూస్తుంటే.. స్పైడర్ ఫ్లాప్ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్టు కనిపిస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ తమిళనాడులో కరైకుడిలో జరిగింది. నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో ఓ సెట్ వేశారు. విదేశీ పర్యటన నుంచి మహేష్ తిరిగొచ్చిన వెంటనే షెడ్యూల్ డీటెయిల్స్ బయటకొస్తాయి.
- Log in to post comments