దువ్వాడ బ్యూటీకి క‌త్తిలాంటి ఆఫ‌ర్లు

Pooja Hegde flooded with hot offers
Saturday, December 16, 2017 - 17:00

డీజేలో చూపించిన అందాలు పూజా హెగ్డేకు టాలీవుడ్ లో కొత్త ఇమేజ్ తీసుకొచ్చాయి. ఎందుకంటే అంత‌కుముందు ఆమె తెలుగులో ఆమె గ్లామర్ షో చేయ‌లేదు. డీజేకి ముందు రెండు సినిమాల్లో న‌టించింది. ఎట్టకేలకు డీజేతో ఆ అవకాశం రావడంతో దాన్ని ఫుల్లుగా వాడేసుకుంది పూజా. పనిలోపనిగా బికినీ కూడా వేసింది. ఈ గ్లామర్ షో ఆమెకు ఇపుడు క్రేజీ ఆఫర్లు తెచ్చిపెట్టింది.

తాజా సమాచారం ప్రకారం త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో రూపొందే సినిమాలో ఈ భామ ఆల్మోస్ట్ క‌న్‌ఫ‌మ్ అయింద‌ట‌. త్వ‌ర‌లోనే ఆమె పేరు ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంద‌ని టాక్‌. అలాగే మహేష్ బాబు సినిమాలో పూజా హెగ్డే కు హీరోయిన్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మ‌హేష్ హీరోగా దిల్‌రాజ్ నిర్మించే సినిమాలో  పూజాను హీరోయిన్ గా తీసుకునే ఛాన్స్ ఉందిట‌.

దిల్ రాజు కోటరీలోకి ఏ హీరోయిన్ చేరినా అతడి బ్యానర్ లో 2 సినిమాలు చేయాల్సిందే. ఫిదాలో నటిస్తున్న సాయిపల్లవి, దిల్ రాజు నెక్ట్స్ మూవీ ఎంసీఎలో కూడా హీరోయిన్‌గా న‌టించింది.. సో.. ఈ లెక్కన డీజే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే.. దిల్ రాజు నిర్మించనున్న మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మ‌రోవైపు, ఈ భామ తాజాగా రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న రంగ‌స్థ‌లంలో ఐటెంసాంగ్ చేస్తోంది. అంటే 2018లో ఆమెని వెండితెర‌పై ప‌లు సినిమాల్లో చూస్తామ‌న్న‌మాట‌.