హీరోయిన్‌గా చాలా ప్రయత్నాలు చేసింది నీహారిక. మెగా డాటర్ అని ముద్దుగా పిలిపించుకున్న నాగబాబు కూతురు నీహారిక ఇపుడు హీరోయిన్ వేషాలకి ఎండ్‌కార్డు వేసింది. చేసిన సినిమాలన్నీ ఢమాల్ అనడంతో ఆమె ఇక సినిమాల్లో హీరోయిన్‌గా నటించకూడదని నిర్ణయం తీసుకొంది. ఇంతకుముందే ఆమె "ముద్దు పప్పు ఆవకాయ" అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇపుడు మళ్లీ అదే రూట్‌లోకి వచ్చింది.
చాలా కాలం తర్వాత 'మ్యాడ్ హౌస్' అనే పేరుతో వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. ఇది ఏడాదిన్నర పాటు సాగుతుందట. నిహారిక ఓ వీడియో విడుదల చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది.