నీహారిక లబ్‌డబ్ అంతా వెబ్
Submitted by tc editor on Tue, 2019-09-17 20:32
Niharika brings another web series
Tuesday, September 17, 2019 - 19:30

హీరోయిన్‌గా చాలా ప్రయత్నాలు చేసింది నీహారిక. మెగా డాటర్ అని ముద్దుగా పిలిపించుకున్న నాగబాబు కూతురు నీహారిక ఇపుడు హీరోయిన్ వేషాలకి ఎండ్‌కార్డు వేసింది. చేసిన సినిమాలన్నీ ఢమాల్ అనడంతో ఆమె ఇక సినిమాల్లో హీరోయిన్‌గా నటించకూడదని నిర్ణయం తీసుకొంది. ఇంతకుముందే ఆమె "ముద్దు పప్పు ఆవకాయ" అనే వెబ్ సిరీస్లో నటించింది. ఇపుడు మళ్లీ అదే రూట్‌లోకి వచ్చింది.
చాలా కాలం తర్వాత 'మ్యాడ్ హౌస్' అనే పేరుతో వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. ఇది ఏడాదిన్నర పాటు సాగుతుందట. నిహారిక ఓ వీడియో విడుదల చేస్తూ ఈ విషయాన్ని బయటపెట్టింది.
సైరా సినిమాలో చిన్న పాత్ర పోషించింది. తమ కుటుంబానికి చెందిన హీరోల సినిమాల్లో ఇలాంటి చిన్న పాత్రలు తప్ప హీరోయిన్ వేషాలు మాత్రం చేయనంటోంది.
- Log in to post comments