ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి "సాహో". మరోటి జిల్ రాధాకృష్ణకుమార్ డైరక్షన్‌లో. ఈ రెండో సినిమాకి "అమోర్" అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అమోర్ అనే ఆ ఫ్రెంచ్ టైటిల్ ఎంత మందికి అర్ధమవుతుందనే సంశయంతో ఇపుడు "జాను" అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారట. "జాను" అనే ఈ టైటిల్ క్యాచీగా ఉండడం, రెండక్షరాల టైటిల్ కావడంతో ప్రభాస్ దీనికి ఫిక్స్ అయ్యాడనేది టాక్.
మామూలుగానే ప్రభాస్ కు కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువ. కొత్త వ్యక్తులు కలిస్తే చాలా సిగ్గుపడిపోతాడు. కాఫీ విద్ కరణ్ షోలో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. పక్కనే ఉన్న రానా, రాజమౌళి కూడా కన్ ఫర్మ్ చేశారు. అయితే ప్రభాస్ పీక్స్ లో సిగ్గుపడితే ఎలా ఉంటుందో తెలుసా..? దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఈ స్టిల్.
"మనం" సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నాగార్జున పాత్ర గుర్తుందా. ఓ జమీందార్ పాత్రలో కనిపించిన నాగార్జునకు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చితే ఎంత డబ్బు ఖర్చుపెట్టి అయినా ఆ కారును సొంతం చేసుకుంటాడు. సరిగ్గా ఇలాంటి పాత్రనే ఇప్పుడు ప్రభాస్ కూడా పోషిస్తున్నాడు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ పీరియడ్ లవ్ స్టోరీ చేస్తున్నాడు ప్రభాస్. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో వింటేజ్ కార్లు కొనే ధనవంతుడిగా కనిపించబోతున్నాడు ప్రభాస్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ వివరాల్ని స్వయంగా వెల్లడించాడు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ని తెలంగాణ రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ కట్టుకున్న గెస్ట్‌హౌస్ హైదరాబాద్‌లోని రాయదుర్గం ఏరియాలో సర్వే నెంబర్ 45లో ఉంది. సర్వే నెంబర్ 45లో 84 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో 2200 గజాల ప్లాట్‌ని ప్రభాస్ కొనుక్కొని గెస్ట్‌హౌస్ కట్టుకున్నాడు. ఐతే ఈ సర్వే నంబర్ మొత్తంగా ప్రభుత్వానికే చెందుతుందని మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల కారణంగా అధికారులు సైలెంట్‌గా ఉన్నారు. ఇపుడు స్వాధీనం చేసుకున్నారు.
ప్రభాస్‌కి షాక్ తగిలింది. ప్రభాస్ కొనుక్కొన్న ప్రీమియం ల్యాండ్ ప్రభుత్వానికి వెళ్తోంది. తెలిసో, తెలియక ప్రభాస్ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో కొంతస్థలం కొన్నాడు.ఆ స్థలాన్ని తన గెస్ట్‌హౌస్ కోసం వాడుతున్నాడు. అయితే, ఇటీవల కోర్టు ఆ సర్వే నెంబర్‌లోని మొత్తం స్థలం ప్రభుత్వానిదే అని తీర్పు ఇచ్చింది. రాయదుర్గంలోని మొత్తం 85 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.