ప్రభాస్‌కి ఊరట దక్కేనా?

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ని తెలంగాణ రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ప్రభాస్ కట్టుకున్న గెస్ట్‌హౌస్ హైదరాబాద్‌లోని రాయదుర్గం ఏరియాలో సర్వే నెంబర్ 45లో ఉంది. సర్వే నెంబర్ 45లో 84 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలో 2200 గజాల ప్లాట్‌ని ప్రభాస్ కొనుక్కొని గెస్ట్‌హౌస్ కట్టుకున్నాడు. ఐతే ఈ సర్వే నంబర్ మొత్తంగా ప్రభుత్వానికే చెందుతుందని మూడు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల కారణంగా అధికారులు సైలెంట్‌గా ఉన్నారు. ఇపుడు స్వాధీనం చేసుకున్నారు.
ఐతే గెస్ట్‌హౌస్‌ని కూల్చామని మీడియాలో వచ్చిన వార్తలు అబద్దమని డిప్యూటీ కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభాస్ లీగల్‌గా వెళ్తే మాకు ఇబ్బందేమీ లేదని కూడా క్లారిటీ ఇచ్చాడు.
ఆయన ఇంతకుముందే రెగ్యులరైజేషన్ కోసం అప్లయి చేశాడట. ఐతే ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రెగ్యులరైజేషన్ అనేది చెల్లదు. అలాగే హైకోర్టుకి ప్రభాస్ వెళ్లినా...పెద్దగా ఫలితం ఉండదనేది వాదన. ఐతే ప్రభాస్ మాత్రం హైకోర్టుని ఆశ్రయించనున్నాడు.
- Log in to post comments