ప్ర‌భాస్ గెస్ట్‌హౌస్ సీజ్ చేసిన అధికారులు

Prabhas guest house siezed
Tuesday, December 18, 2018 - 10:00

ప్ర‌భాస్‌కి షాక్ తగిలింది. ప్ర‌భాస్ కొనుక్కొన్న ప్రీమియం ల్యాండ్ ప్ర‌భుత్వానికి వెళ్తోంది. తెలిసో, తెలియ‌క ప్ర‌భాస్ హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గంలో కొంత‌స్థ‌లం కొన్నాడు.ఆ స్థ‌లాన్ని త‌న గెస్ట్‌హౌస్ కోసం వాడుతున్నాడు. అయితే, ఇటీవ‌ల కోర్టు ఆ స‌ర్వే నెంబ‌ర్‌లోని మొత్తం స్థ‌లం ప్ర‌భుత్వానిదే అని తీర్పు ఇచ్చింది. రాయ‌దుర్గంలోని మొత్తం 85 ఎక‌రాలు పూర్తిగా ప్ర‌భుత్వానికే చెందుతుంద‌ని  సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఆ 85 ఎక‌రాలను స్వాధీనం చేసుకోవాల‌ని కోర్టు తెలిపింది. కొంద‌రు ప్రైవేట్ వ్య‌క్తులు, ఆ 85 ఎక‌రాల‌ను ప్లాట్లుగా చేసి అమ్మారు. అలా ప్ర‌భాస్  2,200 గజాల స్థ‌లాన్ని కొని, గెస్ట్‌హౌస్‌ను నిర్మించాడు. 

దీన్ని జీవోనంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ ప్ర‌భాస్‌ దర ఖాస్తు చేసుకున్నాడ‌ట‌. అయితే ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసినట్లు తెలంగాణ రెవెన్యూ అధికారులు తెలిపారు. కోర్టు అదేశాల మేర‌కే స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.