హారర్ సినిమా జోనర్‌కి కొన్ని ఫిక్స్‌డ్ ట్రోప్స్ ఉంటాయి. హారర్ కామెడీకి అంతే. కథ, స్రీన్‌ప్లేలో తేడా ఉండొచ్చు, కానీ హారర్ కామెడీ జానర్‌లో తీసే అన్ని సినిమాల్లోనూ కొన్ని ఎలిమెంట్స్ కామన్‌గా కనిపిస్తాయి. ఆ ఎలిమెంట్స్ సరిగా కుదిరితే బ్లాక్‌బస్టర్. సరిగా పండకపోతే అంతే సంగతులు. రీసెంట్ వచ్చిన చాలా హారర్ కామెడీ సినిమాలు తేడా కొట్టడానికి రీజన్.. మిక్సింగ్ పక్కాగా లేకపోవడమే.
"రాజు గారి గది 2" ...తొలి వీకెండ్ కలెక్షన్లు బాగున్నాయి. నాగార్జునని హారర్ కామెడీలో జనం రిసీవ్ చేసుకుంటారా అన్న డౌట్స్ పటాపంచాలు అయ్యాయి. అందుకే ఆనందంలో మునిగి తేలుతున్నట్లు ఉంది నాగ్. ఆదివారం ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్‌లో నాగ్ మోతాదు మించిన జోష్‌లో మాట్లాడాడు.
బీర్లు, ఆల్కహాల్, సిగరెట్ గురించి ఏ హీరో ఓపెన్‌గా మాట్లాడారు. ఎందుకంటే అభిమానులకి ఆదర్శంగా ఉండాలి. అయితే నాగార్జున ఈ సక్సెస్ మీట్‌లో ఓపెన్‌గా రెండు బీర్లు లాగించేశా అని చెప్పడం విశేషం.