హ్యాపీగా రెండు బీర్లు వేశా: నాగార్జున‌

Had two beers in happy mood: Nagarjuna confesses
Sunday, October 15, 2017 - 19:30

"రాజు గారి గ‌ది 2" ...తొలి వీకెండ్ కలెక్ష‌న్లు బాగున్నాయి. నాగార్జునని  హారర్ కామెడీలో జ‌నం రిసీవ్ చేసుకుంటారా అన్న డౌట్స్ ప‌టాపంచాలు అయ్యాయి. అందుకే ఆనందంలో మునిగి తేలుతున్న‌ట్లు ఉంది నాగ్‌. ఆదివారం ఈ సినిమా స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ స‌క్సెస్ మీట్‌లో నాగ్ మోతాదు మించిన‌ జోష్‌లో మాట్లాడాడు. 

బీర్లు, ఆల్క‌హాల్‌, సిగ‌రెట్ గురించి ఏ హీరో ఓపెన్‌గా మాట్లాడారు. ఎందుకంటే అభిమానుల‌కి ఆద‌ర్శంగా ఉండాలి. అయితే నాగార్జున ఈ స‌క్సెస్ మీట్‌లో ఓపెన్‌గా రెండు బీర్లు లాగించేశా అని చెప్ప‌డం విశేషం.

"రాజు గారి గ‌ది 2 " సినిమా చూసి త‌న అభిమానులు కాలరెగురేసుకుంటున్నార‌ని అన్నాడు. ఒక‌వైపు హైద‌రాబాద్, రాయ‌ల‌సీమ‌లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ టైమ్‌లో జ‌నం థియేట‌ర్‌కి వ‌స్తారా  అని డిస్ట్రిబ్యూట‌ర్లు భ‌య‌ప‌డ్డారు. అందుకే ఈ క‌లెక్ష‌న్ల‌కి నాగార్జున అంత ఆనందంగా ఉన్నాడు. ప్ర‌స్తుతం వ‌చ్చిన ఓపెనింగ్స్ ఎక్స్‌ట్రార్డ‌న‌రీ ఏమీ కాదు. వ‌ర్షాలు, హార‌ర్ జాన‌ర్‌, పెళ్లి త‌ర్వాత స‌మంత నుంచి వ‌చ్చిన మూవీ కావ‌డం....వంటి కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఈ క‌లెక్ష‌న్ల‌కి హ్య‌పీగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

"ఎంతో సంతోషంగా ఉంది. హ్య‌పీగా రెండు బీర్లు వేశా," అని న‌వ్వుతూ చెప్పాడు. మీసం తీయ‌డంతో ఆయ‌న లుక్ బాలేద‌ని కామెంట్స్ వ‌స్తున్నాయి. దీనిపై కూడా స్పందించాడు. నా మీసం నా ఇష్టమ‌బ్బా అంటూ న‌వ్వాడు. మ‌రోవైపు, స‌మంత కూడా పెళ్లికి అభిమానులు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పింది.