దెయ్యం క‌థ‌ల్లో ఫ‌న్ పోతోందా?

Fun elements are missing in horror comedies in Tollywood
Monday, October 16, 2017 - 11:30

హార‌ర్ సినిమా జోన‌ర్‌కి కొన్ని ఫిక్స్‌డ్ ట్రోప్స్ ఉంటాయి. హార‌ర్ కామెడీకి అంతే. క‌థ‌, స్రీన్‌ప్లేలో తేడా ఉండొచ్చు, కానీ హార‌ర్ కామెడీ జాన‌ర్‌లో తీసే అన్ని సినిమాల్లోనూ కొన్ని ఎలిమెంట్స్ కామ‌న్‌గా క‌నిపిస్తాయి. ఆ ఎలిమెంట్స్ స‌రిగా కుదిరితే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. స‌రిగా పండ‌క‌పోతే అంతే సంగ‌తులు. రీసెంట్ వ‌చ్చిన చాలా హార‌ర్ కామెడీ సినిమాలు తేడా కొట్టడానికి రీజ‌న్.. మిక్సింగ్ ప‌క్కాగా లేక‌పోవ‌డ‌మే.

తాజాగా వ‌చ్చిన "రాజుగారి గ‌ది 2 " విష‌యంలోనూ కామెడీ ఏ మాత్రం పండ‌లేద‌న్న విమ‌ర్శ అంద‌రి నోటా వినిపించింది. హార‌ర్ కామెడీలో కామెడీ స‌రిగా కుద‌ర‌డం చాలా ఇంపార్టెంట్‌. వెన్నెల కిషోర్‌, శ‌క‌ల‌క శంక‌ర్‌, ప్రవీణ్‌..ఇలా ముగ్గురు క‌మెడియ‌న్లు ఉన్నా స‌రిగా న‌వ్వించ‌లేక‌పోయారు. దానికి కార‌ణం స‌న్నివేశాల్లో ఫ‌న్ లేక‌పోవ‌డ‌మే.

"ప్రేమ‌క‌థాచిత్రం" నుంచి ఈ జాన‌ర్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నింటిలో అన్ని కోణాల్లో మ్యాగ్జిమ‌మ్ కామెడీని పిండేశారు. ఇక ఇపుడు జ్యూస్ రావ‌డం లేదు. అంతా పిప్పే. అదే స‌మ‌స్య అయింది. పూర్తిగా కొత్త‌గా ఆలోచిస్తే త‌ప్ప ఈ జాన‌ర్‌లో రెగ్యుల‌ర్ ట్రోప్స్‌తో కామెడీ పండించ‌లేరు. హార‌ర్ కామెడీలో ఫ‌న్ ఎలిమెంట్ పూర్తిగా మిస్ అవుతోంది.