తిరుమల కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామిని సమంత శనివారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమలకి ఆమె ఒక్కరే రావడం విశేషం. ఈ జనవరిలో ఆమె హీరో నాగ చైతన్యతో నిశ్చితార్థం జరుపుకొంది. కానీ ఆమె వెంట చైతన్య కానీ, కుటుంబ సభ్యులు కానీ లేరు.
ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన బాహుబలి-2 సినిమాను నిన్న రాత్రి చూశాడు రామ్ చరణ్. తండ్రి చిరంజీవితో కలిసి ఐమ్యాక్స్ లో వేసిన ప్రత్యేక ప్రదర్శనలో బాహుబలి – ది కంక్లూజన్ సినిమా చూశారు. ఈ సినిమాపై ఇప్పటికే చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. యూనిట్ అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు చరణ్ కూడా బాహుబలి-2ను మెచ్చుకున్న సెలబ్స్ జాబితాలోకి చేరిపోయాడు.