శ్రీవారిని ద‌ర్శించుకున్న స‌మంత‌

Samantha prays at Tirumala temple
Saturday, May 20, 2017 - 19:15

తిరుమ‌ల కొండ‌పై శ్రీ వేంకటేశ్వరస్వామిని సమంత శనివారం ఉదయం దర్శించుకున్నారు. తిరుమ‌లకి ఆమె ఒక్క‌రే రావ‌డం విశేషం. ఈ జ‌న‌వ‌రిలో ఆమె హీరో నాగ చైత‌న్య‌తో నిశ్చితార్థం జ‌రుపుకొంది. కానీ ఆమె వెంట చైత‌న్య కానీ, కుటుంబ సభ్యులు కానీ లేరు.

వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. స్వల్ప తోపులాట కూడా జరిగింది. స‌మంత ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తీస్తున్న ప్రేమ‌క‌థ‌లో న‌టిస్తోంది. అయితే ఎండ‌ల తీవ్ర‌త కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌ని వాయిదా వేశారు. జూన్‌లో మ‌ళ్లీ షూటింగ్ మొద‌ల‌వుతుంది. చ‌ర‌ణ్ మూవీతో పాటు మ‌హాన‌టి సావిత్రి జీవిత‌గాథ‌లోనూ ఆమె న‌టిస్తోంది.