బాహుబలిని మెచ్చిన మ‌గ‌ధీర‌

Ram Charan praises Baahubali2
Thursday, May 4, 2017 - 00:45

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన బాహుబలి-2 సినిమాను నిన్న రాత్రి చూశాడు రామ్ చరణ్. తండ్రి చిరంజీవితో కలిసి ఐమ్యాక్స్ లో వేసిన ప్రత్యేక ప్రదర్శనలో బాహుబలి – ది కంక్లూజన్ సినిమా చూశారు. ఈ సినిమాపై ఇప్పటికే చిరంజీవి రెస్పాండ్ అయ్యారు. యూనిట్ అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు చరణ్ కూడా బాహుబలి-2ను మెచ్చుకున్న సెలబ్స్ జాబితాలోకి చేరిపోయాడు.

బాహుబలి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కితాబిచ్చాడు చెర్రీ. రాజమౌళి ఊహ, క్రియేషన్ తో గ్రాండియర్ విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన బాహుబలి-2 సినిమా.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉందంటున్నాడు చరణ్. మన డార్లింగ్ ప్రభాస్ నటుడిగా ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేశాడని… అలాగే రానా కూడా తన పర్ఫార్మెన్స్ తో బెస్ట్ అనిపించుకున్నాడని మెచ్చుకున్నాడు. ఇక అనుష్క, రమ్య కృష్ణ, సత్య రాజ్, తమన్నా తన నటనతో కట్టిపడేశారని పొగిడేసిన చెర్రీ… ఓవరాల్ గా బాహుబలి-2 సినిమా ప్రతి ఫిలిం మేకర్ కి స్ఫూర్తినిచ్చేలా ఉందన్నాడు.