1995 వైస్రాయ్ ఉదంతం చూసిన వారు, ఆనాటి రాజకీయ పరిణామాలను గమనించిన వారు ఎవరైనా.. వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" ట్రయిలర్‌ని ఇష్టపడుతారు. దాదాపుగా ఆనాటి పరిస్థితులను తన సినిమాలో ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది. లక్ష్మీపార్వతికి ఎందరితోనూ సంబంధాలున్నాయనీ అప్పట్లో వినిపించిన పుకార్లను కూడా ఉన్నదున్నట్లుగా డైలాగ్ ద్వారా పెట్టాడు వర్మ. ఈ కొత్త ట్రయిలర్‌లో వినిపించిన డైలాగ్‌లు అన్ని అప్పట్లో ఆన్ ది రికార్డో, ఆఫ్ ది రికార్డో విన్నవే.
ప్రపంచశాంతి కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు కేఏపాల్. బిషప్ పాల్‌గారి మాటలను మాత్రం మన తెలుగు జనాలు కామెడీగా తీసుకుంటున్నారు. ఏపీలో 175 సీట్లకి 175 గెలుస్తానన్న ఆయన స్టేట్‌మెంట్స్‌ని నవ్వుకోవడానికి వాడుకుంటున్నారు. జనం సంగతేమో కానీ ట్విట్టర్‌లో మాత్రం కేఏ పాల్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నాడు దర్శకుడు వర్మ. పాల్‌ని రాంగోపాల్ వర్మ చేస్తున్నట్లుగా ఎవరూ ట్రాల్ చేయడం లేదు.
కులం, మతం వంటివి పక్కన పెట్టి మనందంరం భారత దేశాన్ని టాప్‌లో నిలపాలని కేఏ పాల్ ఎమోషనల్ గా ఇచ్చారు ఓ మెసేజ్. ఆ వీడియోను షేర్ చేస్తూ వర్మ వరుసగా సెటైర్లు పేలుస్తున్నారు.
రాంగోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" వివాదాలు క్రియేట్ చేస్తోంది. కోర్టు కేసులనూ ఆహ్వానిస్తోంది. వర్మకి కావాల్సింది కూడా అదే. ఎంత వివాదం రేగితే, సినిమాకి అంత మంచిది. అదే వర్మ పాటించే పబ్లిసిటీ సూత్రమిదే. ఆయన ఊహించినట్లే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఈ సినిమాపై హైకోర్టుని ఆశ్రయించారు.