"ఆర్ఎక్స్ 100" చిత్రంతో పాపులర్ అయ్యాడు యువ దర్శకుడు అజయ్ భూపతి. ఆత్రేయపురం ప్రాంతానికి చెందిన అజయ్ భూపతి పలు సినిమాలకి రాంగోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా చేశాడు. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. యూత్‌కి నచ్చే విధంగా సినిమాని నేరేట్ చేయడంతో ఈ దర్శకుడితో పని చేసేందుకు నితిన్, రామ్ వంటి హీరోలు ముందుకొచ్చారు. ఫైనల్‌గా రామ్‌తోనే తన నెక్స్ట్ మూవీ సెట్ చేసుకున్నాడట.
టైమ్ కలిసిరానపుడు ఎన్ని సెంటిమెంట్‌లు అయినా వర్కవుట్ కావు అనేది చాలా మంది మాట. రామ్ పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. "ఉన్నది ఒకటే జిందగీ" సినిమా ఫ్లాప్ కావడంతో అర్జెంట్‌గా హిట్ కావాలనే ఉద్దేశంతో దిల్‌రాజు సినిమాని ఒప్పుకున్నాడు రామ్. అంతకుముందు దిల్‌రాజు బ్యానర్‌లో "రాజా ది గ్రేట్" సినిమాని చేసేందుకు ఒప్పుకోలేదు. పారితోషికం విషయంలో వచ్చిన పేచీ కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. అది హిట్ కావడంతో ఈ సారి రామ్ తగ్గాడు. రామ్ దిల్‌రాజు సినిమా ఒప్పుకున్న టైమ్‌లో నిర్మాతగా ఆయన సూపర్ స్థితిలో ఉన్నాడు. వరుసగా ఆరు హిట్స్ ఇచ్చి ఒక ప్రౌడ్ పొజిషన్‌లో ఉన్నాడు దిల్ రాజు.