రామ్‌తో ఆర్ ఎక్స్ 100 దర్శకుడి మూవీ?

"ఆర్ఎక్స్ 100" చిత్రంతో పాపులర్ అయ్యాడు యువ దర్శకుడు అజయ్ భూపతి. ఆత్రేయపురం ప్రాంతానికి చెందిన అజయ్ భూపతి పలు సినిమాలకి రాంగోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా చేశాడు. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. యూత్‌కి నచ్చే విధంగా సినిమాని నేరేట్ చేయడంతో ఈ దర్శకుడితో పని చేసేందుకు నితిన్, రామ్ వంటి హీరోలు ముందుకొచ్చారు. ఫైనల్‌గా రామ్‌తోనే తన నెక్స్ట్ మూవీ సెట్ చేసుకున్నాడట.
ఈ యువ దర్శకుడు ఇద్దరు హీరోల కథ ఒకటి తయారు చేశాడట. అందులో ఒక హీరోగా రామ్, మరో హీరోగా మహానటి ఫేమ్ మలయాళ యూత్ సూపర్‌స్టార్ దుల్కర్ సల్మాన్ నటించే అవకాశం ఉంది. రామ్ చూచాయగా అంగీకరించాడు. ఇటీవల అజయ్ పెళ్లికి అటెండ్ అయిన హీరోల లిస్ట్‌లో నితిన్, రామ్ మాత్రమే ఉన్నారు. రామ్‌తో ప్రత్యేక బంధం ఏర్పడిందట.
ఐతే రామ్‌తో సినిమా ఓకే అయినా.. అది సెట్ వరకు వెళ్లేంతవరకు నమ్మలేం. గతంలో శ్రీనువైట్ల, అనిల్‌రావిపూడి, ప్రవీణ్ సత్తారు, కందీరీగ సంతోష్ శ్రీనివాస్ సినిమాలు అనౌన్స్ అయ్యో, పూజాకార్యక్రమాలు జరుపుకునే ఆగిపోయాయి. సో.."ఆర్ ఎక్స్ 100" దర్శకుడు నెక్స్ట్ మూవీ రామ్‌తోనే జరుగుతుందా లేదా అన్నది షూటింగ్ మొదలయ్యే వరకు చెప్పలేం.
- Log in to post comments