"ఆర్ ఎక్స్ 100" వంటి సినిమాలు సూపర్‌హిట్ కావడం, తన సంస్కారవంతమైన సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దిల్ాజుకి ఏమి చెప్పాలో అర్ధం కావడం లేనట్లుంది. తాను నిర్మించిన శ్రీనివాస కల్యాణం, లవర్ వంటి సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో సరిగా విశ్లేషణ చేయకుండా ఆయన కిస్ సీన్ల మీద వ్యాఖ్యానాలు చేశాడు. ప్రస్తుతం కిస్ సీన్లు లేకపోతే సినిమాలు ఆడడం లేదని అంటున్నాడు దిల్‌రాజు.
"ఆర్ఎక్స్ 100" చిత్రంతో పాపులర్ అయ్యాడు యువ దర్శకుడు అజయ్ భూపతి. ఆత్రేయపురం ప్రాంతానికి చెందిన అజయ్ భూపతి పలు సినిమాలకి రాంగోపాల్ వర్మ వద్ద సహాయకుడిగా చేశాడు. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. యూత్‌కి నచ్చే విధంగా సినిమాని నేరేట్ చేయడంతో ఈ దర్శకుడితో పని చేసేందుకు నితిన్, రామ్ వంటి హీరోలు ముందుకొచ్చారు. ఫైనల్‌గా రామ్‌తోనే తన నెక్స్ట్ మూవీ సెట్ చేసుకున్నాడట.