నేను కూడా ముద్దుసీన్లు తీయాలేమో: దిల్‌రాజు

"ఆర్ ఎక్స్ 100" వంటి సినిమాలు సూపర్‌హిట్ కావడం, తన సంస్కారవంతమైన సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దిల్ాజుకి ఏమి చెప్పాలో అర్ధం కావడం లేనట్లుంది. తాను నిర్మించిన శ్రీనివాస కల్యాణం, లవర్ వంటి సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో సరిగా విశ్లేషణ చేయకుండా ఆయన కిస్ సీన్ల మీద వ్యాఖ్యానాలు చేశాడు. ప్రస్తుతం కిస్ సీన్లు లేకపోతే సినిమాలు ఆడడం లేదని అంటున్నాడు దిల్‌రాజు.
ప్రేక్షకులు ఎవరూ మంచీ చెడూ ఆలోచించడం లేదని, ఎంటర్‌టెయిన్మెంట్ ఉందా లేదా అన్నదే చూస్తున్నారని దిల్‌రాజు వాపోతున్నారు. తాను ఆరోగ్యకర పద్దతిలో సినిమాలు తీసినా జనం చూడడం లేదనేది ఆయన బాధ. తాను నిర్మించే సినిమాల్లో ఇక తాను కూడా కిస్ సీన్లనుపెట్టాలేమో అని వ్యాఖ్యానించాడు.
కిస్ సీన్లు పెడితేనే సినిమాలు ఆడుతాయి అనుకోవడం కన్నా పిచ్చి అనాలిసిస్ ఇంకోటి ఉండదు. కానీ ఫ్లాప్‌లతో సెల్ఫ్ కాన్పిడెన్స్ కోల్పోయిన దిల్ాజు ఇపుడు ఇలా అనుకోవడం ట్రాజెడీ. మొన్నటి వరకు తాను ఏమి తీస్తే అది జనం చూస్తారనుకున్న దిల్‌రాజుకిపుడు కాలం మారినట్లు కనిపిస్తోంది.
- Log in to post comments