ఒక చిన్న సినిమా 10 కోట్ల థియేటర్ వసూళ్లను సంపాదించడం అంటే మాములు మేటర్ కాదు. కొత్త తారలతో కొత్త దర్శకుడు కొత్త నిర్మాత తీసిన "ఆర్ఎక్స్ 100" షేర్ ఇప్పటికే 9 కోట్ల రూపాయల దగ్గరికి వచ్చింది. ఒక నైజాంలోనే 4 కోట్ల షేర్‌ని దాటింది. మొత్తం రన్ పూర్తయ్యేసరికి ఎంత వసూల్ చేయగలదు?
ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా రూ. 14 నుంచి రూ.15 కోట్ల వరకు రాబట్టగలదని అంచనా. నైజాంలో ఏడు కోట్ల రూపాయల వరకు, ఉత్తరాంధ్రలో కోటిన్నర వరకు, సీడెడ్‌లోనూ కోటిన్నర వరకు రాబడుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే పెళ్లి చూపులు సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ మూవీ.