అందరూ ఊహించినట్లే నాని నటిస్తున్న "ఎం.సి.ఎ" డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈసారి దిల్‌రాజు వెనక్కి తగ్గుతాడు అనుకున్నారు. కానీ ఈ టాప్ ప్రొడ్యుసర్ మరోసారి విడుదల తేదీని అధికారికంగా అనౌన్స్ చేశాడు. ఎవరు పోటీలో ఉన్నా లేకున్నా...నా సినిమా అనుకున్న డేట్‌కే వస్తుందని బల్లగుద్ది చెప్పాడు. విజయగర్వమా? ఆత్మవిశ్వాసమా? ఏదీ ఏమైనా "ఎం.సి.ఎ" క్రిస్మస్ కానుకగా 21న థియేటర్లలో హల్‌చల్ చేస్తుంది.