సాయి పల్లవి టెక్కు టమారం మామూలుగా లేదు అని హీరో నాగ శౌర్య కుండబద్దలు కొట్టాడు. ఒక ఇంటర్వ్యూలో అతను ఇలా ఓపెన్‌గా మాట్లాడాడు. ఈ హీరో అలా అనడంతో ఒక్కసారిగా సాయి పల్లవి అటిట్యూడ్ గురించి డిస్కషన్ మొదలైంది టాలీవుడ్ ఇండస్ట్రీలో.
పల్లవి రెగ్యులర్ హీరోయిన్ కాదు. ఈ అమ్మడు వచ్చిన ఆఫర్‌నల్లా ఒప్పుకోదు. తనకి నచ్చితేనే చేస్తుంది. డబ్బు వస్తుందా కదాని సైన్ చేయదు. అలాగే నాని లాంటి హీరో సినిమాలో నటించినా..ఆమె రిలీజ్ తర్వాత ఎంసీఎ ప్రమోషన్‌కి రాలేదు. ఎందుకంటే ఆమె సీన్లని కుదించారు. దాంతో అలా అలక వహించి..దిల్‌రాజుకి కూడా ఝలక్ ఇచ్చింది.