సాయి ప‌ల్ల‌వికి నిజంగా టెక్కు ఉందా?

Sai Pallavi showing attitude; throwing tantrums?
Tuesday, January 16, 2018 - 14:00

సాయి ప‌ల్ల‌వి టెక్కు ట‌మారం మామూలుగా లేదు అని హీరో నాగ శౌర్య కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. ఒక ఇంటర్వ్యూలో అత‌ను ఇలా ఓపెన్‌గా మాట్లాడాడు. ఈ హీరో అలా అన‌డంతో ఒక్క‌సారిగా సాయి ప‌ల్ల‌వి అటిట్యూడ్ గురించి డిస్క‌ష‌న్ మొద‌లైంది టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో.

ప‌ల్ల‌వి రెగ్యుల‌ర్ హీరోయిన్ కాదు. ఈ అమ్మ‌డు వ‌చ్చిన ఆఫ‌ర్‌న‌ల్లా ఒప్పుకోదు. త‌న‌కి న‌చ్చితేనే చేస్తుంది. డ‌బ్బు వ‌స్తుందా క‌దాని సైన్ చేయ‌దు. అలాగే నాని లాంటి హీరో సినిమాలో న‌టించినా..ఆమె రిలీజ్ త‌ర్వాత ఎంసీఎ ప్ర‌మోష‌న్‌కి రాలేదు. ఎందుకంటే ఆమె సీన్ల‌ని కుదించారు. దాంతో అలా అల‌క వ‌హించి..దిల్‌రాజుకి కూడా ఝ‌ల‌క్ ఇచ్చింది.

క్రేజ్ తెచ్చుకున్న‌ హీరోలంద‌రూ ఎంత స్ట‌యిల్ కొడుతారో, ఆమె కూడా అంతే అని మ‌న‌కి అర్థ‌మ‌వుతోంది. ఈ విష‌యంలో ఆమెని త‌ప్పు ప‌ట్టాలా?  హీరోలు రూట్‌లోనే హీరోయిన్లు అనుకోవ‌చ్చు క‌దా. ఒక్క హిట్ కొట్ట‌గానే హీరోలు నిర్మాత‌ల‌కి చుక్క‌లు చూపిస్తున్నారు. తాము దివి నుంచి ఊడిప‌డ్డ‌ట్లు బిల్డ‌ప్‌లు ఇస్తున్నారు.  నిజం చెప్పాలంటే...ఇపుడు యువ హీరోల క‌న్నా ఈ ఫిదా బ్యూటీకి ఎక్కువ క్రేజ్ ఉంది. అంతెందుకు నాగ శౌర్య సినిమా అంటే క‌నీసం 10 శాతం ఓపెనింగ్ కూడా రాదు. అదే సాయి ప‌ల్ల‌వి ఉందంటే వ‌చ్చే ఓపెనింగ్‌, సినిమాకయ్యే బిజినెస్‌, శాటిలైట్ రైట్స్‌కున్న క్రేజే వేరు. మ‌రి త‌న పేరుతో అంత వ్యాపారం అవుతున్న‌పుడు ఆ మాత్రం యాటిట్యూడ్ చూపుతుంది క‌దా!

ఫిదా బ్యూటీకున్న క్రేజ్‌, స‌క్సెస్ త‌న‌కి వ‌స్తే నాగ శౌర్య భూమ్మీద ఉండేవాడా? స‌క్సెస్‌తో పాటు ప్రతి స్టార్ ఎంతో కొంత టెక్కు చూపిస్తాడు. అందుకు సాయి ప‌ల్ల‌వి అతీతురాలు కాదని స‌రిపెట్టుకోవాలి.