సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆమె అద్భుతమైన నటననే చూశారు కానీ ఆమె స్టెప్పులేస్త రంగస్థలం అదిరిపోద్ది. ఇపుడు ఆమెకి ఆ అవకాశం ఒక తమిళ సినిమాలో దక్కింది.
ధనుష్ సరసన 'మారి 2' చిత్రంలో నటిస్తోంది సాయి పల్లవి. దీపావళి సందర్భంగా ఆమె స్టిల్స్ కొన్నింటిని విడుదల చేశారు. సాయిపల్లవి స్వాగ్ అంటూ తెలుగు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ స్టిల్స్ చూసి ఫిదా అయిపోయి, ట్వీట్ చేశాడు. ఆటోరాణి గెటప్‌లో అదరగొట్టింది ఫిదా పిల్ల. 'బాషా' సినిమాలో రజనీకాంత్ లుక్ ని తలపిస్తోంది ఈ బ్యూటీ.