"రౌడీ బేబీ" అనే పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా మెన్సన్ చేయక్కర్లేదు. ఈ మధ్య ఏ ఫంక్షన్‌కి వెళ్లినా ఆ పాట మోగుతూనే ఉంది. పిల్లలకి, కుర్రకారుకి హాట్ ఫేవరేట్‌గా మారింది. తమిళనాడులోనే కాదు సౌత్ అంతా ఇది హిట్ సాంగ్. ఈ పాట ఇపుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. 600 మిలియన్ల వ్యూస్‌ని దాటింది. 600 మిలియన్ల వ్యూస్ పొందిన ఏకైక సౌత్ ఇండియన్ ఫిల్మ్ సాంగ్‌గా ఇది కొత్త రికార్డు క్రియేట్ చేసింది.