సాయి పల్లవి సెన్సేషన్

"రౌడీ బేబీ" అనే పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా మెన్సన్ చేయక్కర్లేదు. ఈ మధ్య ఏ ఫంక్షన్‌కి వెళ్లినా ఆ పాట మోగుతూనే ఉంది. పిల్లలకి, కుర్రకారుకి హాట్ ఫేవరేట్‌గా మారింది. తమిళనాడులోనే కాదు సౌత్ అంతా ఇది హిట్ సాంగ్. ఈ పాట ఇపుడు మరో రికార్డు క్రియేట్ చేసింది. 600 మిలియన్ల వ్యూస్‌ని దాటింది. 600 మిలియన్ల వ్యూస్ పొందిన ఏకైక సౌత్ ఇండియన్ ఫిల్మ్ సాంగ్‌గా ఇది కొత్త రికార్డు క్రియేట్ చేసింది.
యువన్ శంకర్ రాజా కంపోజిషన్ ఇది. ఐతే ఈ పాటలో సాయి పల్లవి డ్యాన్స్ బాగా క్లిక్ అయింది. ఆమె స్టెప్పులలోని ఈజ్, ట్యూన్‌లోని క్యాచీనెస్ ఈ పాట ఇంత క్లిక్ కావడానికి కారణం. ఫిదా తర్వాత ఆమె బాగా డ్యాన్స్ చేసిన పాట ఇదే.
సాయి పల్లవి ఇపుడు విరాటపర్వం అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రానా హీరో. ఐతే రానా అమెరికాలో ట్రీట్‌మెంట్ చేసుకుంటున్నాడు. ఈ గ్యాప్‌లో తనకి సంబంధించిన అన్ని సీన్లని పూర్తి చేస్తోంది సాయి పల్లవి. వచ్చే నెల నుంచి ఆమె నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తీసే రొమాంటిక్ డ్రామాతో బిజీ అవుతుంది.
- Log in to post comments