నాని మూడులో ఉన్నాడు!

Can Nani deliver hat-trick this year?
Tuesday, November 28, 2017 - 18:15

అంద‌రూ ఊహించిన‌ట్లే నాని న‌టిస్తున్న "ఎం.సి.ఎ" డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఈసారి దిల్‌రాజు వెన‌క్కి త‌గ్గుతాడు అనుకున్నారు. కానీ ఈ టాప్ ప్రొడ్యుస‌ర్ మ‌రోసారి విడుద‌ల తేదీని అధికారికంగా అనౌన్స్ చేశాడు. ఎవ‌రు పోటీలో ఉన్నా లేకున్నా...నా సినిమా అనుకున్న డేట్‌కే వ‌స్తుంద‌ని బ‌ల్ల‌గుద్ది చెప్పాడు. విజ‌య‌గ‌ర్వ‌మా? ఆత్మ‌విశ్వాస‌మా?  ఏదీ ఏమైనా "ఎం.సి.ఎ" క్రిస్మ‌స్ కానుక‌గా 21న థియేట‌ర్ల‌లో హల్‌చ‌ల్ చేస్తుంది.

నానికి ఈ ఏడాది ఇది మూడో చిత్రం. ఫిబ్ర‌వ‌రిలో "నేను లోక‌ల్" విడుద‌లైంది. ఆ త‌ర్వాత "నిను కోరి" వ‌చ్చింది. రెండు విజ‌యాలు త‌ర్వాత మూడో మూవీతో 2017కి గ్రాండ్‌గా బై చెప్పాల‌నుకుంటున్నాడు. సూప‌ర్ హిట్ రేషియో ఇది. నాని స‌క్సెస్ స్వింగ్ అలా ఉంది మ‌రి.

అన్న‌ట్లు ఈ సినిమాలో హీరోయిన్ ఫిదా పిల్ల‌.. సాయి ప‌ల్లవి. ప్ర‌స్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ఫోక‌స్ అంతా నానిపైనే. వ‌రంగల్ నేప‌థ్యంగా సాగే ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత సాయి ప‌ల్ల‌వి పేరు మార్మోగుతుందా అనేది చూడాలి.