'బాహుబలి 2' సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఇక ప్రపంచవ్యాప్త వసూళ్లలో 'దంగల్' సినిమా నంబర్ వన్ ఇండియన్ మూవీగా నిలిచింది. ఈ రెండు సినిమాలు పోటీపడి మరీ వసూళ్ల వర్షం కురిపించాయి. మిగతా హీరోలకు సరికొత్త టార్గెట్స్ ఫిక్స్ చేశాయి. అయితే ఈ రెండు సినిమాలు సాధించిన రికార్డుల్ని క్రాస్ చేయాలంటే అది కొంతమంది హీరోలకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రస్తుతం అందరి చూపు సల్మాన్ ఖాన్, రజనీకాంత్ పైనే పడింది.
మెగాస్టార్ చిరంజీవిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రాస్ చేశాడు. జనరల్ గా బాక్సాఫీస్ లెక్కలు, వంద రోజుల సెంటర్లు లాంటి క్యాలిక్యులేషన్లు తీస్తే అది వివాదాలకు దారితీస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అంతా క్లియర్. అఫీషియల్ గా చిరంజీవిని ఎన్టీఆర్ దాటేసినట్టే. కాకపోతే ఈ ఫీట్ వెండితెరపై కాదు.. బుల్లితెరపై నమోదు కానుంది.