మ‌న బిగ్‌బాస్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌

NTR to host Big Boss in Telugu
Monday, May 29, 2017 - 16:45

మెగాస్టార్ చిరంజీవిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రాస్ చేశాడు. జనరల్  గా బాక్సాఫీస్ లెక్కలు, వంద రోజుల సెంటర్లు లాంటి క్యాలిక్యులేషన్లు తీస్తే అది వివాదాలకు దారితీస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి కాంట్రవర్సీ లేదు. అంతా క్లియర్. అఫీషియల్ గా చిరంజీవిని ఎన్టీఆర్ దాటేసినట్టే. కాకపోతే ఈ ఫీట్ వెండితెరపై కాదు.. బుల్లితెరపై నమోదు కానుంది.

త్వరలోనే మాటీవీలో బిగ్ బాస్ రియాల్టి షో ప్రారంభంకానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన షో ఇది. బాలీవుడ్ స్టార్ నటీనటులు చాలామంది పాల్గొన్న రియాల్టి షో ఇది. ఇలాంటి షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతానికి ఇది అన్-అఫీషియల్. కానీ పక్కా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ -4 కు చిరంజీవికి ఎంత ఎమౌంట్ ఇచ్చారో.. అంతకంటే పెద్ద ఎమౌంట్ ను బిగ్ బాస్ కోసం ఎన్టీఆర్ కు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రాబోతోంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తే కానుక బుల్లితెరపై రెమ్యునరేషన్ పరంగా చిరంజీవిని ఎన్టీఆర్ క్రాస్ చేసినట్టే.