నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ రూపొందించనున్న కొత్త సినిమా ఇటీవలే లాంఛనంగా లాంచ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లుంటారట. ఒక హీరోయిన్‌గా శ్రియాని తీసుకోనున్నారనేది లేటెస్ట్ టాక్. దర్శకుడు కె.ఎస్.రవికుమార్... ఇంతకముందు బాలయ్యతో తీసిన "జైసింహా" సినిమాలో నయనతార, హరిప్రియని హీరోయిన్లుగా తీసుకున్నాడు. ఈసారి నిర్మాత సీ.కల్యాణ్ సలహా ప్రకారం ఒక హీరోయిన్‌గా శ్రియాని తీసుకోవాలనుకుంటున్నాడట.
శ్రియ శరన్ తన ఫోటోలను రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. కానీ తన భర్త . ఆండ్రి ఫోటోలను అప్‌లోడ్
చేయదు. భర్తతో కలిసి దిగిన ఫోటోలను అస్సలు తన టైమ్‌లైన్‌లో కనిపించనివ్వదు. తన భర్త దేశం అయిన రష్యాకి వెళ్లినపుడు కూడా తన సోలో ఫోటోలనే పెడుతుంటుంది. ఐతే తాజాగా ఆమె హబ్బీ ఆండ్రితో ఆనందంగా దిగిన ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.
భర్తకి ముద్దు పెడుతున్న ఫోటోలు కూడా వచ్చాయి. 37 ఏళ్ల శ్రీయ గతేడాది పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత బాలయ్య సరసన కథానాయకుడు సినిమాలో నటించింది. ఐతేల ఇపుడు మాత్రం అస్సలు అవకాశాలు రావడం లేదు.
పెళ్లి తర్వాత కూడా శ్రియా బిజీగా మారాలని చాలా ప్రయత్నించింది. పెళ్లితోనే తన కెరియర్‌కి ఎండ్‌కార్డ్ పడొద్దని ఆమె చాలా ట్రై చేస్తోంది. కానీ ఈ ఆర్నెళ్ల కాలంలో ఆమెకి కొత్తగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల విడుదలైన వీర భోగ వసంత రాయలు దారుణంగా పరాజయం పాలైంది.
రజనీకాంత్ కొత్త సినిమాలో అవకాశం వస్తుందని చాలా ఆశపడింది. అది కూడా నెరవేరలేదు. నాగార్జున, వెంకటేష్, చిరంజీవి వంటి సీనియర్ హీరోలు కూడా శ్రియాతో జతకట్టడం లేదు ఇపుడు. మొత్తమ్మీద పెళ్లి తర్వాత శ్రియాకి ఆఫర్లు డ్రై అయ్యాయి.